నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని పదర మండలం రాయలగండిలో శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి వార్షిక కళ్యాణ మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ వేడుకలకు కూచుకుల రాజేష్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ మరియు సీబీఎం ట్రస్ట్ చైర్‌పర్సన్ డాక్టర్ చిక్కుడు అనురాధ ఆహ్వానం మేరకు ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి పాల్గొన్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చెన్నకేశవ స్వామి కళ్యాణాన్ని దర్శించుకోవడం భక్తులకు శుభప్రదమని పేర్కొన్నారు.
దేవస్థాన అభివృద్ధి, నిర్మాణ కార్యక్రమాలకు తన వ్యక్తిగత నిధుల ద్వారా సహకరించేందుకు అవకాశం కల్పించిన దేవస్థాన కమిటీకి కృతజ్ఞతలు తెలిపారు. అచ్చంపేట నియోజకవర్గం నలుమూలల నుంచి భక్తులు పెద్ద ఎత్తున హాజరై స్వామివారి కళ్యాణాన్ని దర్శించుకోవడం ఆనందదాయకమని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఉమ్మడి అమ్రాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, దేవస్థాన కమిటీ సభ్యులు, వివిధ శాఖల అధికారులు, పత్రికా విలేకరులు తదితరులు పాల్గొన్నారు.
0 కామెంట్‌లు