అచ్చంపేట నియోజకవర్గంలోని అమ్రాబాద్ మండలం దోమలపెంట బ్రహ్మగిరి గ్రామంలో హిందూ స్మశాన వాటికకు ఎదురుగా ఫారెస్ట్ అధికారులు సులాభ్ కాంప్లెక్స్ నిర్మాణానికి చేపట్టిన ప్రయత్నాన్ని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో హిందూ సంఘాల నాయకులు అడ్డుకున్నారు.
స్మశాన వాటిక సమీపంలో ప్రజా మరుగుదొడ్డి నిర్మాణం చేపట్టడం అనుచితమని పేర్కొంటూ వారు సంఘటనా స్థలానికి చేరుకుని నిర్మాణ పనులను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. దీంతో అటవీ శాఖ అధికారులు పనులను తాత్కాలికంగా నిలిపివేశారు.
ఈ సందర్భంగా నాయకులు అధికారులతో చర్చించి తమ అభ్యంతరాలను తెలియజేశారు. ప్రజల భావోద్వేగాలను గౌరవించాలని, ప్రత్యామ్నాయ స్థలాన్ని ఎంపిక చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ అమ్రాబాద్ మండల అధ్యక్షుడు బొడ్డుపల్లి శ్రీనివాసులు, మండల ప్రధాన కార్యదర్శి మహేష్, నాయకులు శేఖర్, శ్రీను, బాలరాజు, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
ఈ ఘటన ప్రాంతంలో చర్చనీయాంశంగా మారింది.
0 కామెంట్‌లు