పినపాక :పినపాక నియోజకవర్గంలో అభివృద్ధి పనులు,గ్రామీణ మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు తెలిపారు. ఆదివారం మండల పరిధి లోని పోతిరెడ్డిపల్లి క్రింది గుంపు వాగుపై సుమారు రూ. 65 లక్షల వ్యయంతో నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి పనులను ఆయన స్వయంగా పరిశీలించారు. పనుల పురోగతిని సమీక్షిస్తూ, నిర్మాణ నాణ్యతలో ఎలాంటి రాజీ పడకూడదని అధికారులకు స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ, బ్రిడ్జి పూర్తయితే పరిసర గ్రామాల మధ్య రాకపోకలు సులభతరం అవుతాయని, ముఖ్యంగా వర్షాకాలంలో ప్రజలు ఎదుర్కొనే ఇబ్బందులు పూర్తిగా తొలగిపోతాయని తెలిపారు. పనులను వేగవంతంగా పూర్తి చేసి త్వరితగతిన ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
గ్రామీణ అభివృద్ధి దిశగా ఎమ్మెల్యే పాయం అడుగులు వేస్తుండటం పినపాక ప్రజల్లో ఆనందం వ్యక్తమవుతోంది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు రామనాథం, సర్పంచ్ వాగబోయిన చందర్రావు, ఈ బయ్యారం ఉపసర్పంచ్ సందీప్ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు పేరం వెంకటేశ్వర్లు, తోలేం అర్జున్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు
0 కామెంట్‌లు