మానవత్వం చాటుకున్న పూర్వ స్నేహితులు

మానవత్వం చాటుకున్న పూర్వ స్నేహితులు
పినపాక :పినపాక మండలం పోతూరెడ్డిపల్లి గ్రామానికి చెందిన పున్నం నాగమణి క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ వైద్య ఖర్చులకు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలుసుకున్న 2006–07 పదవ తరగతి పూర్వ విద్యార్థులు మానవత్వం చాటుకున్నారు.
తమ స్నేహితురాలు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ, ఆమె చికిత్స కోసం తమవంతుగా రూ.30,000 నగదు ఆర్థిక సహాయం అందజేశారు. ఆపద సమయంలో తోడుగా నిలిచిన పూర్వ స్నేహితుల దాతృత్వానికి నాగమణి కృతజ్ఞతలు తెలిపారు.
సంక్షోభ సమయంలో స్నేహబంధం నిలబెట్టిన ఈ యువకుల చర్య పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు