స్పర్శా లెప్రసీపై అవగాహన అవసరం – హెచ్ఈఓ హనుమంతు



పినపాక మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో స్పర్శా లెప్రసీ (కుష్టు వ్యాధి)పై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని హెచ్ఈఓ హనుమంతు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మండలం పోతిరెడ్డిపల్లి గ్రామంలో గల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మాట్లాడుతూ లెప్రసీ అనేది పూర్తిగా నయం అయ్యే వ్యాధి అని, ప్రారంభ దశలోనే గుర్తిస్తే సాధారణ మందులతో పూర్తిగా చికిత్స సాధ్యమని తెలిపారు.చర్మంపై తెల్లని మచ్చలు, స్పర్శకు స్పందన తగ్గడం, నరాల మందబాటు వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రిని సంప్రదించాలని సూచించారు. లెప్రసీపై అనవసర భయాలు, అపోహలు ప్రజల్లో ఉన్నాయని, వాటిని తొలగించేందుకు అవగాహన కార్యక్రమాలు ఎంతో అవసరమన్నారు.
ప్రభుత్వం ద్వారా లెప్రసీకి ఉచితంగా పరీక్షలు, మందులు అందిస్తున్నామని, వ్యాధి ఉన్న వారిని వివక్షకు గురిచేయకుండా సహానుభూతితో చూడాలని ఆయన కోరారు. స్పర్శా లెప్రసీపై ప్రతి ఒక్కరూ సరైన అవగాహన కలిగి ఉంటే, సమాజంలో ఈ వ్యాధిని పూర్తిగా నిర్మూలించవచ్చని హనుమంతు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆరోగ్య సిబ్బంది ప్రవీణ్, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు పాల్గొని ప్రజలకు అవసరమైన సమాచారం అందించారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు