నాగర్‌కర్నూల్ మున్సిపాలిటీ పరిధిలోని 2వ, 8వ, 13వ వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా విస్తృతంగా ఎన్నికల ప్రచారం కొనసాగింది. ఈ ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వీహెచ్ హనుమంతరావుతో పాటు నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే డా. కూచుకుళ్ల రాజేష్ రెడ్డి పాల్గొన్నారు.
ఈ వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులైన బాదం రమేష్, పొడుగు శ్రీనివాసులు, కొత్త శ్రీనివాసులు తరఫున ఇంటింటా తిరుగుతూ ఓటర్లను కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డా. రాజేష్ రెడ్డి మాట్లాడుతూ, అభివృద్ధి అంటేనే కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. ప్రజల సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తోందని పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుకు ఓటు వేసి అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు.
ఈ ప్రచార కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని ఎన్నికల వాతావరణాన్ని ఉత్సాహంగా మార్చారు.
#NagarKurnool
#MunicipalElections
#CongressParty
#VH_HanumanthaRao
#RajeshReddyMLA
#Ward2
#Ward8
#Ward13
#VoteForCongress
#SBNews
0 కామెంట్‌లు