పినపాక మండలం పొట్లపల్లి గ్రామంలో ఉపాధి హామీ పథకం కింద పనిచేస్తున్న కార్మికులకు అవసరమైన పని సామాగ్రిని గ్రామ సర్పంచ్ మద్దెల సమ్మయ్య పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రామాభివృద్ధిలో ఉపాధి హామీ కార్మికుల పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు. కార్మికులు సురక్షితంగా, సమర్థవంతంగా పని చేయాలనే ఉద్దేశంతో పనికి అవసరమైన సామాగ్రిని అందించామని తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కల్పనతో పాటు అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని అన్నారు.
కార్మికులు కూడా సర్పంచ్ తీసుకున్న చర్యను స్వాగతిస్తూ, తమకు అందించిన సహకారానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కళ్యాణి, ఉప సర్పంచ్ రవీందర్, గ్రామపంచాయతీ సభ్యులు, ఉపాధి హామీ సిబ్బంది పాల్గొన్నారు.
0 కామెంట్‌లు