రెండో వార్డులో సీపీఎం ప్రచారం ఉధృతం – ప్రజల అభివృద్ధికి ఎర్రజండాకు పట్టం కట్టండి

నాగర్ కర్నూల్, ఫిబ్రవరి 05 (ఎస్‌బి న్యూస్):
నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో జరుగుతున్న మున్సిపాలిటీ ఎన్నికల్లో రెండో వార్డు కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్టు) (సీపీఎం) అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆర్. శ్రీనివాసులు గురువారం విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి కౌన్సిల్‌లో అవకాశం ఇవ్వాలని ఆయన ఓటర్లను కోరారు.
ఈ సందర్భంగా శ్రీనివాసులు మాట్లాడుతూ, తాను కార్మిక–కర్షకుల సమస్యల సాధనలో పోరాటాల నుంచి వచ్చిన నాయకుడినని పేర్కొన్నారు. గతంలో మున్సిపాలిటీ కార్మికులు, చాటకూలీ, హమాలీ కార్మికులు, పేదల నివాస సమస్యలపై అనేక ఉద్యమాలు నిర్వహించినట్లు తెలిపారు. ప్రజలు ఆశీర్వదించి గెలిపిస్తే వార్డు అభివృద్ధి కోసం నిరంతరం పోరాడతానని హామీ ఇచ్చారు.
పేదలకు పెన్షన్లు, రేషన్ కార్డులు, మంచినీటి సరఫరా, వీధిదీపాలు, రోడ్లు, డ్రైనేజీ నిర్మాణం—ముఖ్యంగా ఊరి చివరి వరకు డ్రైనేజీ ఏర్పాటు కోసం కృషి చేస్తానని ఆయన స్పష్టం చేశారు.
ఈ ప్రచార కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యురాలు గీత, మాజీ ఎంపీటీసీ యాదయ్య, జిల్లా కమిటీ సభ్యులు పొదీల రామయ్య, తారాసింగ్తో పాటు జిల్లా నాయకులు మధు, కాశన్న, నరసింహ, కురుమయ్య, శ్రీనివాసులు, చారి, సురేందర్, శివ తదితరులు పాల్గొన్నారు.

#CPM
#ఎర్రజండా
#Ward2
#NagarKurnool
#MunicipalElections
#PeopleFirst
#WorkersRights
#LocalDevelopment

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు