నాగర్ కర్నూల్, ఫిబ్రవరి 05 (ఎస్‌బి న్యూస్):
నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని బల్మూర్ మండలం జినుకుంట గ్రామ మహిళా సర్పంచ్ రంగినేని ప్రేమలతపై జరిగిన దాడిని ఖండిస్తూ జిల్లా సర్పంచుల సంక్షేమ సంఘం ప్రతినిధులు గురువారం జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్‌ను కలిసి బాధ్యులపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా సంఘం నాయకులు మాట్లాడుతూ, ప్రజాప్రతినిధులపై దాడులు ప్రజాస్వామ్య వ్యవస్థకు విఘాతం కలిగిస్తాయని పేర్కొన్నారు. మహిళా సర్పంచ్‌కు న్యాయం జరిగేలా వెంటనే చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా సర్పంచుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు రామ్ భీష్మ, ఉపాధ్యక్షుడు పరమేష్తో పాటు సర్పంచులు రంగినేని పుష్పలత, శ్రీదేవి, గోపాల్ తదితరులు పాల్గొన్నారు.
#మహిళాసర్పంచ్
#దాడిని_ఖండించాలి
#SarpanchWelfareAssociation
#Achampet
#Balmur
#NagarKurnool
#JusticeForSarpanch
#SBNews
0 కామెంట్‌లు