మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న అచ్చంపేట ఎమ్మెల్యే డా. చిక్కుడు వంశీకృష్ణ17, 22వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతుగా ఇంటింటా ప్రచారం

నాగర్ కర్నూల్, ఫిబ్రవరి 05 (ఎస్‌బి న్యూస్):
నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో ఈ నెల 11న జరగనున్న మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా విస్తృత ప్రచారం కొనసాగుతోంది. ఈ ప్రచార కార్యక్రమంలో జిల్లా మున్సిపల్ ఎన్నికల ఇన్‌చార్జి, అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ పాల్గొన్నారు.
కాంగ్రెస్ పార్టీ బలపరిచిన 17వ వార్డు మున్సిపల్ సభ్యురాలు పి. రాజేశ్వరి, 22వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి ఆవంచ మాధవి రాజులకు మద్దతుగా స్థానిక ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేష్ రెడ్డి, ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డిలతో కలిసి ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే వంశీకృష్ణ మాట్లాడుతూ, ప్రజా ప్రభుత్వాన్ని నడిపిస్తున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పట్టణ ప్రజలను కోరారు. 17వ వార్డులో పి. రాజేశ్వరిని గెలిపిస్తే స్థానిక సమస్యల పరిష్కారం సాధ్యమవుతుందని తెలిపారు. అలాగే 22వ వార్డులో ఆవంచ మాధవి రాజును గెలిపిస్తే డ్రైనేజీ, రోడ్లు, తాగునీటి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని చెప్పారు.
కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో అనేక సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని, ప్రజాపాలనే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. నాగర్‌కర్నూల్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అన్ని వార్డుల అభ్యర్థులను గెలిపించి మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. జిల్లా మున్సిపల్ ఎన్నికల ఇన్‌చార్జిగా తనను నియమించిన టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో నాగర్‌కర్నూల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ఫిబ్రవరి 11న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుందని నేతలు తెలిపారు.

#NagarKurnool
#MunicipalElections
#CongressCampaign
#AchampetMLA
#ChikkuduVamsiKrishna
#Ward17
#Ward22
#VoteForCongress
#TelanganaPolitics
#SBNews

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు