“మంచం” గుర్తుకు ఓటు వేయండి – బీఎంపీ అభ్యర్థులకు గడ్డం విజయ్ పిలుపు

“మంచం” గుర్తుకు ఓటు వేయండి – బీఎంపీ అభ్యర్థులకు గడ్డం విజయ్ పిలుపు
నాగర్ కర్నూల్, ఫిబ్రవరి 05 (ఎస్‌బి న్యూస్):
నాగర్‌కర్నూల్ మున్సిపాలిటీ పరిధిలో జరుగుతున్న ఎన్నికల్లో బహుజన్ ముక్తి పార్టీ (బీఎంపీ) అభ్యర్థులకు మద్దతుగా ఇంటింటా ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. బీఎంపీ పార్లమెంట్ ఇన్‌చార్జి గడ్డం విజయ్ ఓటర్లను “మంచం” గుర్తుకు ఓటు వేసి పార్టీ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 16వ వార్డు బీఎంపీ అభ్యర్థి కావలి రామకృష్ణను “మంచం” గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ పార్టీలు పేదలు, మధ్యతరగతి ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ప్రభుత్వ నిధులు బడా పెట్టుబడిదారులు, డబ్బు, పలుకుబడి ఉన్న వర్గాలు, అగ్రకులాలకు మాత్రమే ఖర్చు అవుతున్నాయని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ పేద వర్గాలను మోసం చేస్తున్నారని విమర్శించారు.
అలాగే 2వ వార్డు అభ్యర్థి బాకీ పరశు రాములు, 5వ వార్డు అభ్యర్థి బి. వెంకట్ రాములు, 13వ వార్డు అభ్యర్థి ఎ. శివకుమార్‌లకు కూడా “మంచం” గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు చంద్రయ్య, శివ తదితరులు పాల్గొన్నారు.

#మంచం_గుర్తు
#BMP
#BahujanMuktiParty
#NagarKurnool
#MunicipalElections
#WardElections
#VoteForChange
#SBNews

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు