కారేపల్లి: కారేపల్లి మండలం ప్రభుత్వ జూనియర్ కళాశాల కస్తూర్బా విద్యాలయంలో శనివారం తెలుగు భాషా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. తెలుగు భాష ఔన్నత్యానికి విశేష కృషి చేసిన గిడుగు రామ్మూర్తి పంతులు చిత్రపటానికి పూలమాల వేసిన నివాళులు అర్పించారు. కేజీబీవీలో విద్యార్థులకు తెలుగు భాష ప్రాముఖ్యతపై ఉపన్యాస, నాటికలు, నృత్యాలు, వర్ణమాలల అనుకరిస్తూ క్యాట్ వాక్ వంటి కళారూపాలు ప్రదర్శించారు. తెలుగు ఉపాధ్యాయులు, అధ్యాపకులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ విజయకుమారి, కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్ ఝాన్సీ సౌజన్య అధ్యాపకులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
0 కామెంట్‌లు