కరెంట్ షాక్‌తో గేదె మృతి


పినపాక మండలం పరిధిలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఏడూళ్ల బయ్యారం గ్రామపంచాయతీ కొత్తరెడ్డిపాలెం గ్రామంలో కరెంట్ షాక్‌కు గురై ఓ గేదె మృతి చెందింది.
గ్రామానికి చెందిన రైతు తుమ్మ సంజీవ రెడ్డి గారి గేదె మేతకు వెళ్లి తిరిగి ఇంటికి వస్తున్న సమయంలో ప్రధాన రహదారి పక్కన ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ఎర్త్ వైర్ తగలడంతో అక్కడికక్కడే కుప్పకూలి మృతి చెందింది. మృతిచెందిన గేదె విలువ సుమారు రూ.1.20 లక్షలు ఉంటుందని రైతు తెలిపారు.
గ్రామస్తుల సమాచారం ప్రకారం, ఇదే ప్రాంతంలో గతంలో కూడా ఆరు గేదెలు కరెంట్ షాక్‌తో మృతి చెందినట్లు తెలుస్తోంది. తరచూ ఇలాంటి ఘటనలు జరుగుతున్నప్పటికీ విద్యుత్ శాఖ అధికారులు సరైన చర్యలు తీసుకోలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇకనైనా విద్యుత్ స్థంభాలు, ట్రాన్స్ఫార్మర్‌ల వద్ద రక్షణ ఫెన్సింగ్ ఏర్పాటు చేసి ప్రమాదాలు నివారించాలని గ్రామస్తులు కోరుతున్నారు. సంబంధిత అధికారులు తక్షణం స్పందించి బాధిత రైతుకు నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేస్తున్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు