గుండాల మండలం, ఫిబ్రవరి 16 (స్వాతంత్ర్య భారత్): గుండాల మండలం తురుబాక గ్రామంలో జోగవారి వంశీయుల ఆరాధ్య దైవమైన ఆదిశక్తి లక్ష్మీదేవి జాతర మహోత్సవానికి సంబంధించిన గోడ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కల్తీ రాధ పాల్గొని పోస్టర్‌ను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ, తురుబాక గ్రామంలో ఇలవేల్పు అయిన లక్ష్మీదేవి జాతరను వేలాది భక్తులతో, కనివిని ఎరగని కోయనాట్య ప్రదర్శనలతో వైభవంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై అమ్మవారి ఆశీస్సులు పొందాలని కోరారు.
జాతర కార్యక్రమాల వివరాలు ఇలా ఉన్నాయి: ఫిబ్రవరి 27 శుక్రవారం ప్రతిష్టాపన, కుంకుమ పూజలు, రాత్రి 10 గంటల నుండి గుడి మేల్కొలుపు. ఫిబ్రవరి 28 శనివారం ఉదయం 9 గంటలకు లక్ష్మీదేవి ఊరేగింపు, సాయంత్రం 5 గంటలకు గంగస్థానం, రాత్రి 10 గంటలకు దేవతా నాట్య ప్రదర్శనలు. మార్చి 1 ఆదివారం భక్తులు దేవతలకు మొక్కులు చెల్లించుకోనున్నారు.
కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, పూజారులు, జోగ దమ్మయ్య, జోగ రాంబాబు, జోగ బుచ్చయ్య, జోగ నరసయ్య, జోగ పోతయ్య, జోగ భద్రయ్య, జోగ పగడయ్య, జోగ కృష్ణ, యదలపల్లి కృష్ణ, కల్తీ కాంతారావు, బొమ్మయ్య, లింగయ్య, సందయ్య, బాలయ్య, తురుబాక యువత తదితరులు పాల్గొన్నారు.
0 కామెంట్‌లు