విశ్వహిందూ పరిషత్ మరియు బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో అల్లవరం పట్టణంలో పుల్వామా దాడిలో అమరులైన భారత జవానులకు ఘనంగా కొవ్వొత్తులతో నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నిర్వహించిన శాంతి నిరసన ర్యాలీలో దేశభక్తి నినాదాలు మార్మోగాయి. ఉగ్రవాద చర్యలను ఖండిస్తూ, భవిష్యత్తులో ఇలాంటి దాడులు జరగకుండా కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని నాయకులు కోరారు. దేశ భద్రతకు విఘాతం కలిగించే శక్తులపై కఠిన శిక్షలు విధించాలని వారు అభిప్రాయపడ్డారు.
ర్యాలీ అనంతరం అమర జవానుల స్మరణార్థం రెండు నిమిషాల మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో కట్టా నారాయణమూర్తి, కంకిపాటి వీరబాబు, మాకిరెడ్డి సత్తిబాబు, అల్లుఅర్జున్ బాల భజరంగీ, తోట విశాల్, కృష్ణ పటేల్, కొమ్ముల రామచంద్రరావు, కంకిపాటి సుబ్బారావు, యాటి గోపాలం, కాండ్రేగుల వెంకటేశ్వరరావు, కుడిపూడి నాగేశ్వరరావు, వంగానాయుడు, కంకిపాటి శాంతి తదితరులు పాల్గొన్నారు. దేశానికి ప్రాణత్యాగం చేసిన సైనికుల త్యాగం ఎప్పటికీ మరువలేనిదని పాల్గొన్నవారు పేర్కొన్నారు.
0 కామెంట్‌లు