ఇసుక లారీల విధ్వంసంపై లక్ష్మీనగరంలో రేపు ధర్నా

ఇసుక లారీల విధ్వంసంపై లక్ష్మీనగరంలో రేపు ధర్నా
 స్వాతంత్ర్య భారత్ న్యూస్ దుమ్ముగూడెం ప్రతినిధి కాక చంద్రకళ ఫిబ్రవరి 16:
 ఇసుక లారీల నిర్లక్ష్య రాకపోకల వల్ల తరచూ జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు, ప్రజల ప్రాణనష్టం నేపథ్యంలో రేపు (17వ తేదీ) లక్ష్మీనగరంలో ధర్నా నిర్వహించనున్నట్లు మండల నాయకులు తెలిపారు. మండల ప్రజలందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.ప్రతిరోజూ ఏదో ఒకచోట ప్రమాదాలు జరుగుతున్నప్పటికీ అధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డు మీదకు వెళ్లిన వ్యక్తి సురక్షితంగా ఇంటికి చేరుతాడనే హామీ లేకుండా పరిస్థితి మారిందన్నారు.తూరుబాక నుండి పర్ణశాల వరకు నూతన రహదారి నిర్మాణం పూర్తి చేసిన తరువాతే ఇసుక లారీలను నడపాలని డిమాండ్ చేస్తూ, అన్ని రాజకీయ పార్టీలకు అతీతంగా నాయకులు, యువత, ప్రజలు కలిసి ఈ ధర్నాను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజల భద్రతే తమ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు