ఏడూళ్ల బయ్యారం జెడ్పీ హైస్కూల్‌లో రేపు మెగా వైద్య శిబిరం


మౌరిటెక్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం ఏడూళ్ల బయ్యారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కాంప్లెక్స్ పరిధి లోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు ఎంఈఓ నాగయ్య తెలిపారు.
ఈ శిబిరంలో వివిధ విభాగాల నిపుణ వైద్యులు పాల్గొని సాధారణ ఆరోగ్య పరీక్షలు, నిర్వహించడంతో పాటు అవసరమైన వారికి ఉచిత వైద్య సలహాలు, మందులు అందజేస్తారని చెప్పారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎంఈఓ నాగయ్య పిలుపునిచ్చారు. వైద్య శిబిరం ఉదయం నుంచి ప్రారంభమై సాయంత్రం వరకు కొనసాగుతుందని, పాల్గొనే వారు ముందుగానే హాజరై వివరాలునమోదు చేసుకోవాలని వారు సూచించారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు