గ్రామపంచాయతీ వార్డు సభ్యులకు శిక్షణ సమావేశం ఏర్పాటు


గ్రామాల అభివృద్ధి, పారదర్శక పరిపాలన లక్ష్యంగా గ్రామపంచాయతీ వార్డు సభ్యులకు ప్రత్యేక శిక్షణ సమావేశం నిర్వహించారు. సోమవారం పినపాక మండలంలోని రైతు వేదిక భవనంలో, పినపాక ఎంపీడీవో వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగింది.
ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ గ్రామపంచాయతీ వార్డు సభ్యులు గ్రామాభివృద్ధిలో కీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ప్రభుత్వ పథకాల అమలు, గ్రామసభల నిర్వహణ, పారిశుధ్యం, తాగునీటి సరఫరా, పన్నుల వసూళ్లు వంటి అంశాలపై సభ్యులకు అవగాహన కల్పించారు.గ్రామాల్లో ప్రజల సమస్యలను వెంటనే గుర్తించి, సంబంధిత అధికారులకు తెలియజేసి పరిష్కార దిశగా చర్యలు తీసుకోవాలని సూచించారు. గ్రామ అభివృద్ధి పనుల్లో పారదర్శకత, బాధ్యతాయుతమైన వ్యవహారం అవసరమని తెలిపారు.ఈ శిక్షణ కార్యక్రమంలో మండల స్థాయి అధికారులు, గ్రామపంచాయతీ సెక్రటరీ లు,వార్డు సభ్యులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు