ప్రధాన రహదారిపై ఇసుక మేటలు తొలగింపు


రోడ్డు పక్కన ఇసుక మేటలు పేరుకుపోవడం వల్ల వాహనదారులు జారిపడి ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉందని గుర్తించిన పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు వెంటనే స్పందించారు.
స్థానిక సర్పంచ్ పూనెం వెంకటేశ్వర్లు , ఉపసర్పంచ్‌ అచ్చా నవీన్ లకు తక్షణ చర్యలు తీసుకోవాలని సూచనలు ఇవ్వడంతో పినపాక మండలం తోగ్గుడెం పంచాయతీ కేంద్రంలోని ప్రధాన రహదారి వెంట పేరుకుపోయిన ఇసుక, మట్టిని శుభ్రం చేయించారు.
ప్రజల భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ తీసుకున్న ఈ చర్యను స్థానికులు అభినందించారు. రహదారి పరిశుభ్రంగా మారడంతో వాహనదారులు సురక్షితంగా ప్రయాణించే పరిస్థితి ఏర్పడింది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు