పినపాక మండల పరిధిలోని టేకులగూడెం గుత్తికోయా గ్రామంలో ఏడుళ్ల బయ్యారం సీఐ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఎస్‌ఐ సురేష్ నేతృత్వంలో సోలార్ ప్లేట్లు, సోలార్ లైట్లు పంపిణీ చేశారు. సోమవారం ఈ వయ్యారం పోలీస్ స్టేషన్ లో గ్రామస్తులకు అందజేశారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ
గ్రామ ప్రజల ఇళ్లలో విద్యుత్ సౌకర్యం పూర్తిగా అందుబాటులో లేకపోవడంతో ఈ సోలార్ పరికరాలు వారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని తెలిపారు. రాత్రివేళల్లో వెలుతురు కల్పించడం ద్వారా విద్యార్థుల చదువుకు, కుటుంబాల భద్రతకు ఇది తోడ్పడనుందన్నారు.
ఈ సందర్భంగా గుత్తికోయా ప్రజలు తమ అవసరాలను గుర్తించి సహాయం అందించిన తెలంగాణ పోలీసు శాఖకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఎల్లప్పుడూ తమకు అండగా నిలుస్తూ సహాయ సహకారాలు అందిస్తున్న పోలీసు సిబ్బందిని వారు అభినందించారు.
0 కామెంట్‌లు