కుమ్మెర మల్లన్న జాతర ఘటనపై ప్రజా సంఘాల ఆగ్రహం


నాగర్ కర్నూల్, ఫిబ్రవరి 27,(ఎస్ బి న్యూస్ ప్రతినిధి): నాగర్ కర్నూల్ జిల్లా కుమ్మెర గ్రామం లో జరిగిన మల్లన్న జాతర సందర్భంగా చోటుచేసుకున్న అమానుష ఘటనపై ప్రజాసంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఘటనలో బాధిత కుటుంబానికి ప్రభుత్వం పూర్తి భరోసా కల్పించాలని డిమాండ్ చేశారు. అసలు నిందితులను పట్టుకోకుండా బాధితులపైనే కేసులు నమోదు చేయడం దారుణమని విమర్శించారు.
దేవాలయం అందరిదని, గుడి–బడి వద్ద కుల వివక్షకు తావు లేదని పేర్కొన్నారు. రాజ్యాంగం ముందు అందరూ సమానులేనని స్పష్టం చేశారు. కుల అహంకారంతో చిన్నారి ప్రాణాలు తీసిన దుండగులను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని కోరారు. బాధిత కుటుంబానికి రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియా, ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
న్యాయం జరిగే వరకు అచ్చంపేట జేఏసీ ఆధ్వర్యంలో పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు