కాంగ్రెస్ మైనారిటీ నేత ఖదీర్ పై జరిగిన దాడికి నిరసనగా రాస్తారోకో

కాంగ్రెస్ మైనారిటీ నేత ఖదీర్ పై జరిగిన దాడికి నిరసనగా రాస్తా రోకో 
ఎమ్మెల్యే సూచన మేరకు ప్రోగ్రాం నిర్వహణ 


నాగర్ కర్నూల్, ఫిబ్రవరి 27,(ఎస్ బి న్యూస్ ప్రతినిధి): నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజక వర్గం లోని బల్మూరు మండల కేంద్రం లోగురువారం కాంగ్రెస్ పార్టీ మైనార్టీ నేత ఖదీర్ పై దాడి నిఖండిస్తూ నిరసన గా నెల 27న ఉదయం 11 గంటలకు అంబేద్కర్ చౌరస్తాలో నిరసన కార్యక్రమంనిర్వహించనున్నట్లు కాంగ్రెస్ నాయకులు తెలిపారు. అచ్చంపేట ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షుడు డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ సూచన మేరకు కార్యక్రమం చేపడుతున్నట్లు పేర్కొన్నారు. పురపాలక, వివిధ కమిటీల ఛైర్మన్లు, కౌన్సిలర్లు, మహిళా, యువజన, ఎన్‌ఎస్‌యూఐ, మైనార్టీ, ఎస్సీ, ఎస్టీ, సేవాదళ్ సహా కాంగ్రెస్ అనుబంధ విభాగాల నాయకులు, కార్యకర్తలు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు