కందనూలులో భగ్గుమన్న రాజకీయ కక్షలు -మున్సిపల్ ఎన్నికల ప్రచారం వేళ ఘర్షణ -బీఆర్ఎస్ కార్యకర్తపై కాంగ్రెస్ నేతల దాడితీవ్ర గాయాలు… ఆసుపత్రికి తరలింపు

నాగర్‌కర్నూల్ (ఎస్‌బి న్యూస్):
నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని కందనూలు ప్రాంతంలో రాజకీయ కక్షలు భగ్గుమన్నాయి. మున్సిపల్ ఎన్నికల ప్రచారం ముగింపు దశకు చేరుకున్న నేపథ్యంలో, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తపై కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్యకర్తలు దాడి చేసిన ఘటన కలకలం రేపింది.
ఈ ఘటన సోమవారం జిల్లా కేంద్రంలోని హరిజనవాడ ప్రాంతంలో చోటుచేసుకుంది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం, స్థానిక 13వ వార్డు హరిజనవాడ కాలనీకి చెందిన నీలాంటి మహేష్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త గంగాధర్ వెంట పాల్గొన్నారు. ఈ విషయం జీర్ణించుకోలేని కాంగ్రెస్ పార్టీకి చెందిన ముగ్గురు వ్యక్తులు మహేష్‌పై మూకుమ్మడిగా దాడి చేసినట్లు ఆరోపించారు.
దాడిలో మహేష్ తలపై తీవ్ర గాయాలయ్యాయి. భారీగా రక్తస్రావం కావడంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆయనను నాగర్‌కర్నూల్ జిల్లా జనరల్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.
ఈ ఘటనతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. ఎన్నికల సమయంలో ఇలాంటి సంఘటనలు చోటుచేసుకుంటే శాంతిభద్రతలకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు