ఎఫ్ఏ (ఫార్మేటివ్ అసెస్‌మెంట్) మార్కుల పరిశీలన బృందం నేటి నుంచి మండలంలోని పాఠశాలల్లో తనిఖీలు నిర్వహించనున్నట్లు పినపాక మండల విద్యాధికారి కొమరం నాగయ్య తెలిపారు.
మంగళవారం పినపాక మండలం ఈ–బయ్యారం జిల్లా పరిషత్ పాఠశాల వద్ద ఆయన మాట్లాడారు. మండల పరిధిలోని పది పాఠశాలల్లో ఈ పరిశీలనలు చేపడతామని తెలిపారు.
పదో తరగతి విద్యార్థులకు సంబంధించిన ఎఫ్ఏ మార్కుల పరిశీలన 20 మార్కులకు గాను నిర్వహించబడుతుందని పేర్కొన్నారు. విద్యార్థుల మూల్యాంకనంలో పారదర్శకతకు ఈ తనిఖీలు దోహదపడతాయని ఆయన అన్నారు.
0 కామెంట్‌లు