పినపాక మండలం తోగ్గుడెం గ్రామంలో చేపడుతున్న ఉపాధి హామీ పనులను పినపాక ఎంపీడీవో వెంకటేశ్వరరావు మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా పనుల నాణ్యత, కార్మికుల హాజరు, పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు.ప్రభుత్వ నిబంధనల ప్రకారం పనులు నిర్వహించాలని, కార్మికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామ అభివృద్ధితో పాటు కార్మికులకు ఉపాధి కల్పించడమే లక్ష్యమని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఏపీవో వీరభద్రస్వామి, స్థానిక సెక్రటరీ సంధ్య పాల్గొన్నారు
0 కామెంట్‌లు