పినపాక మండలం పొట్లపల్లి గ్రామంలో రేగా సైన్యం ఆధ్వర్యంలో నిర్వహించనున్న మెగా వాలీబాల్ టోర్నీకి ముఖ్య అతిథిగా హాజరుకావాలని మాజీ శాసనసభ్యులు రేగా కాంతారావును టోర్నీ నిర్వాహకులు మర్యాదపూర్వకంగా ఆహ్వానించారు.
ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ యువతలో క్రీడాస్ఫూర్తి పెంపొందించడమే లక్ష్యంగా టోర్నీ నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రాంతీయ క్రీడాకారులకు ప్రతిభ చాటుకునే వేదికగా ఈ పోటీలు నిలుస్తాయని పేర్కొన్నారు. ఆహ్వానం స్వీకరించిన రేగా కాంతారావు టోర్నీ విజయవంతం కావాలని ఆకాంక్షించారు.
0 కామెంట్‌లు