వేసవిలో తాగునీటికి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోండి-మిషన్ భగీరథ అధికారులకు, ఎంపీవో లకు ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఆదేశాలు

రాబోయే వేసవి కాలంలో ప్రజలకు తాగునీటి కొరత తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని పాయం వెంకటేశ్వర్లు ఆదేశించారు. మంగళవారం మణుగూరులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో మిషన్ భగీరథ అధికారులతో పాటు నియోజకవర్గ ఎంపీవోలతో ఆయన సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాలు, దూరప్రాంతాల్లో నీటి సరఫరా నిరంతరంగా కొనసాగేందుకు అవసరమైన మరమ్మత్తులు, మోటార్లు, పైపులైన్ల పర్యవేక్షణ వెంటనే చేపట్టాలని సూచించారు. ఎక్కడైనా పైపుల లీకేజీలు, మోటార్ సమస్యలు ఉంటే తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు.
వేసవి తీవ్రత పెరగకముందే నీటి ట్యాంకులు శుభ్రపరచడం, నిల్వ సామర్థ్యాన్ని పెంచడం, అవసరమైతే ట్యాంకర్ల ద్వారా సరఫరా చేయడానికి కార్యాచరణ సిద్ధం చేయాలని తెలిపారు. ప్రజలకు తాగునీటి విషయంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేశారు.
సమావేశంలో సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు