జర్నలిస్ట్ కప్–2026కు ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఆహ్వానం అందించిన జర్నలిస్టులు


పినపాక ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో మణుగూరు మండలంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం (ప్రజాభవన్)లో పాయం వెంకటేశ్వర్లును మర్యాదపూర్వకంగా కలిసి జర్నలిస్ట్ కప్–2026 క్రికెట్ టోర్నమెంట్ కు ఆహ్వానం అందజేశారు.పినపాక ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఈ టోర్నమెంట్ జర్నలిస్టులు, అధికారులు, ప్రజాప్రతినిధులు మధ్య స్నేహభావం, క్రీడాస్ఫూర్తి మరియు ఐక్యతను పెంపొందించే ఉద్దేశంతో నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. జర్నలిస్టులు తమ వృత్తి బాధ్యతలతో పాటు క్రీడల ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాలని ఈ కార్యక్రమం ద్వారా ప్రోత్సహిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ జర్నలిస్టులు సమాజానికి దిశానిర్దేశం చేసే వర్గమని, వారిలో ఐక్యత మరియు సత్సంబంధాలు పెంపొందించేందుకు ఇటువంటి క్రీడా కార్యక్రమాలు అవసరమని అన్నారు. టోర్నమెంట్ విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ తన సంపూర్ణ సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు. అనంతరం మణుగూరు డిఎస్పి వంగ రవీందర్ రెడ్డి, సిఐ నాగబాబు, ఎస్సైలను కలిసి ఆహ్వాన పత్రాలు అందజేశారు.ఈ కార్యక్రమంలో పినపాక ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కీసర సుధాకర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి శ్రీరామ్ బృహస్పతి, బిల్లా నాగేందర్, ముక్కు మహేష్ రెడ్డి, సనప భరత్, కట్టా శ్రీనివాసరావు, బూరా శంకర్, జగదీష్, తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు