పినపాక మండలానికి నూతన ఎంపీడీవోగా బాధ్యతలు స్వీకరించిన కంటిపూడి వెంకటేశ్వరరావును గురువారం సర్పంచులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో సీతంపేట గ్రామ సర్పంచ్ శివశంకర్, ఉపసర్పంచ్ ఆరె శ్రవంతి, దుగ్నేపల్లి గ్రామ సర్పంచ్ గుండాపు కిరణ్ కుమార్, ఉపసర్పంచ్ సందీప్ రాజ్‌తో పాటు కాంగ్రెస్ నాయకులు పోకల కృష్ణార్జున్, కొండేరు కృష్ణమూర్తి, నవీన్ తదితరులు పాల్గొని నూతన ఎంపీడీవోకు శాలువాతో సన్మానం చేసి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కంటిపూడి వెంకటేశ్వరరావు గతంలో నిబద్ధతతో, బాధ్యతాయుతంగా సేవలు అందించారని పేర్కొన్నారు. అలాంటి అనుభవం కలిగిన అధికారి పినపాక మండల ఎంపీడీవోగా బాధ్యతలు స్వీకరించడం మండల ప్రజలకు గర్వకారణమని కొనియాడారు. ఆయన నాయకత్వంలో మండల అభివృద్ధి మరింత వేగంగా జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.నూతన ఎంపీడీవో కంటిపూడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ తనపై ఉంచిన నమ్మకానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, మండల అభివృద్ధికి ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజల సహకారంతో పూర్తి స్థాయిలో కృషి చేస్తానని తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా పనిచేస్తానని హామీ ఇచ్చారు.
0 కామెంట్‌లు