నూతన ఎంపిడిఓ ను సన్మానించిన సర్పంచ్



పినపాక మండలానికి నూతన ఎంపీడీవోగా బాధ్యతలు స్వీకరించిన కంటిపూడి వెంకటేశ్వరరావును గురువారం  జగ్గారం సర్పంచ్ సుహాసిని, జాతీ ఆదివాసి గిరిజన సంఘం జిల్లా అధ్యక్షులు రామకృష్ణ దొర ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కంటిపూడి వెంకటేశ్వరరావు గతంలో నిబద్ధతతో, బాధ్యతాయుతంగా సేవలు అందించారని పేర్కొన్నారు. అలాంటి అనుభవం కలిగిన అధికారి పినపాక మండల ఎంపీడీవోగా బాధ్యతలు స్వీకరించడం మండల ప్రజలకు గర్వకారణమని కొనియాడారు. ఆయన నాయకత్వంలో మండల అభివృద్ధి మరింత వేగంగా జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.నూతన ఎంపీడీవో కంటిపూడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ తనపై ఉంచిన నమ్మకానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, మండల అభివృద్ధికి ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజల సహకారంతో పూర్తి స్థాయిలో కృషి చేస్తానని తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా పనిచేస్తానని హామీ ఇచ్చారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు