నాగర్ కర్నూల్ ఫిబ్రవరి 18,(ఎస్ బి న్యూస్ ప్రతినిధి):నాగర్‌కర్నూల్, జిల్లా కలెక్టర్ కార్యాలయం లో బుధ వారం రోజు అక్రిడేషన్ దరఖాస్తుల సందర్భంగా తలెత్తుతున్న సాంకేతిక సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ టి యు డబ్ల్యూ జే (ఐ జేయు) నాగర్‌కర్నూల్ జిల్లా ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్కు వినతిపత్రం సమర్పించారు.
నాగర్ కర్నూల్ జిల్లా పరిధిలోని కల్వకుర్తి నియోజకవర్గంకు చెందిన కొన్ని మండలాలు ఆన్‌లైన్ లో అక్రిడేషన్ దరఖాస్తుల్లో రంగారెడ్డి జిల్లా పరిధిలో ఉన్నట్లుగా చూపిస్తున్నట్లు జర్నలిస్టులు తెలిపారు. దీంతో దరఖాస్తుల ప్రక్రియలో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు.
ఈ విషయాన్ని పరిశీలించి సంబంధిత మండలాలను నాగర్‌కర్నూల్ జిల్లాకు అనుసంధానించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ బాదా వత్ సంతోష్ను కోరారు. సమస్యను పరిశీలించి పరిష్కరిస్తానని కలెక్టర్ హామీ ఇచ్చినట్లు నాయకులు తెలిపారు.
అనంతరం జిల్లా సమాచార ప్రజాసంబంధాల అధికారి కిరణ్ కుమార్ను కలిసి అక్రిడేషన్ ల జారీపై చర్చించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు పి. విజయ్‌కుమార్, కార్యదర్శి ఆర్. సురేష్‌కుమార్ మాట్లాడుతూ అక్రిడేషన్ ప్రక్రియ పారదర్శకంగా సాగాలని వారు కోరారు. అనర్హులకు అవకాశం కల్పించే పరిస్థితి రాకుండా, నిజమైన జర్నలిస్టులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఆన్‌లైన్ దరఖాస్తుల్లో చిన్నపాటి పొరపాట్లు జరిగితే తిరస్కరించకుండా సవరణకు అవకాశం కల్పించాలని సూచించారు. జిల్లాలోని అన్ని పత్రికల స్టాఫ్ రిపోర్టర్లతో సమావేశం ఏర్పాటు చేసి అక్రిడేషన్ విధివిధానాలు, ప్రతి పత్రికకు కేటాయించే కార్డుల సంఖ్యపై ముందస్తు స్పష్టత ఇవ్వాలని కోరారు.
కలెక్టర్, డీపీఆర్వోలను కలిసిన వారిలో నేషనల్ కౌన్సిల్ సభ్యులు సుదర్శన్ రెడ్డి, కర్ణయ్య, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు వెంకటస్వామి, ప్రభాకర్, రాష్ట్ర నాయకుడు శ్యామ్, జిల్లా కార్యవర్గ సభ్యులు పందిరి శ్రీధర్, పట్టాభి, జర్పుల రవీందర్, ఎండి మోబిన్ అహ్మద్ ఖాన్, ఎస్‌ఎస్ బాబు, రమణ కుమార్, ప్రసాద్, ఉపాధ్యక్షుడు రాంప్రసాద్, కొల్లాపూర్ తాలూకా అధ్యక్షుడు రాజేందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
0 కామెంట్‌లు