-బీఆర్‌ఎస్ కార్యకర్తకు ఆర్థిక సహాయం
ఇటీవల అనారోగ్యానికి గురైన బీఆర్‌ఎస్ పార్టీ కార్యకర్త
ఏనిక నర్సింహారావును వారి నివాసంలో
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీఆర్‌ఎస్ అధ్యక్షులు,
పినపాక మాజీ శాసనసభ్యులు రేగా కాంతారావు పరామర్శించారు.
ఈ సందర్భంగా నర్సింహారావు గారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న రేగా కాంతారావు
ధైర్యంగా ఉండాలని భరోసా ఇచ్చారు.
అలాగే వారి వైద్య ఖర్చుల నిమిత్తం రూ.5,000/- ఆర్థిక సహాయం అందజేశారు.
ఏ కష్టం వచ్చినా పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటామని
ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో పినపాక మండల బీఆర్‌ఎస్ అధ్యక్షులు
పగడాల సతీష్ రెడ్డి,స్థానిక సర్పంచ్ ముక్తేష్, ఉపసర్పంచ్ కిషోర్,
పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
0 కామెంట్‌లు