- నాగపూర్‌లో జరిగే బీసీసీఐ ప్రాక్టీస్ మ్యాచులకు ప్రాతినిధ్యం
- - పినపాక జూనియర్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న వైష్ణవి రత్న
పినపాక
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో
ఎర్పాటు చేసిన హైదరాబాద్ అండర్–23 మహిళల వన్డే క్రికెట్ జట్టుకు
వైష్ణవి రత్న ఎంపికైనట్లు హెచ్‌సీఏ అధికారులు ఆదివారం తెలిపారు. భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఆధ్వర్యంలో
నాగపూర్‌లో నిర్వహించనున్న ప్రాక్టీస్ మ్యాచ్‌ల కోసం
హైదరాబాద్ జట్టు ఈ నెల 11 నుండి 17 తేదీ వరకు
వన్డే మ్యాచ్‌లు ఆడనుంది.
ఈ మ్యాచ్‌లలో హైదరాబాద్ జట్టు ముంబై, విదర్భ, ఛత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్ జట్లతో తలపడనుంది.ఈ ప్రతిష్టాత్మక మ్యాచ్‌లకు వైష్ణవి రత్న ఎంపిక కావడం పట్ల
క్రికెట్ వర్గాలు,క్రీడాభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఈ మ్యాచ్‌లు నాగపూర్ లో నిర్వహించనున్నట్లు
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ వెల్లడించింది. వైష్ణవిరత్న పినపాక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతూ ఉన్నది.
0 కామెంట్‌లు