7వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి అనంత అలివేలమ్మకు మద్దతుగా ప్రచారంజిల్లా మున్సిపల్ ఎన్నికల ఇంచార్జీ డా. వంశీకృష్ణ పిలుపు

7వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి అనంత అలివేలమ్మకు మద్దతుగా ప్రచారం
జిల్లా మున్సిపల్ ఎన్నికల ఇంచార్జీ డా. వంశీకృష్ణ పిలుపు
నాగర్ కర్నూల్, ఫిబ్రవరి 08 (ఎస్‌బి న్యూస్):
కాంగ్రెస్ పార్టీ తరఫున 7వ వార్డు మున్సిపల్ కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న అనంత అలివేలమ్మకు మద్దతుగా జిల్లా మున్సిపల్ ఎన్నికల ఇంచార్జీ, అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ విస్తృత ప్రచారం నిర్వహించారు.
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని 7వ వార్డు ఉయ్యాలవాడ ప్రాంతంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొని, కాంగ్రెస్ అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని వార్డు ప్రజలను కోరారు. ఆదివారం రోజు ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ, ఓటర్లు దేవుళ్లేనని పేర్కొంటూ ప్రజల ఆశీర్వాదంతో విజయం సాధించాలని పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా టీపీసీసీ ఉపాధ్యక్షులు, డీసీసీసీ అధ్యక్షుడిగా ఉన్న డాక్టర్ వంశీకృష్ణ మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి కె. రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజా ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని తెలిపారు. ఈ పథకాలు నేరుగా ప్రజల జీవితాలను మెరుగుపరుస్తున్నాయని అన్నారు.
నాగర్ కర్నూల్ మున్సిపాలిటీలో డ్రైనేజీ వ్యవస్థ, రహదారులు, తాగునీటి సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. 7వ వార్డు నుంచి అనంత అలివేలమ్మను గెలిపించి, మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని కాంగ్రెస్ పార్టీకి దక్కేలా పట్టణ ప్రజలు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు