టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు తెల్లం భాస్కర్, మండల నాయకులు గడ్డం వీరన్న
*గుండాల మండలం ఫిబ్రవరి 1 (స్వాతంత్ర్య భారత్) ప్రతినిధి*
ఎన్నికల వస్తున్నాయంటే బిఆర్ఎస్ నాయకులను విచారణకు పిలుస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు తెల్లం భాస్కర్, మండల నాయకులు గడ్డం వీరన్న అన్నారు. జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు ఆదేశాల అనుసారం నిరసన ర్యాలీ అనంతరం మాట్లాడడం పార్టీ అగ్ర నాయకులైన హరీష్ రావు, కేటీఆర్, ఆదివారం తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ని సిట్ పేరుతో విచారణ చేపట్టాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ తన దొంగ వైఖరిని చూపిస్తుందని అన్నారు. అధికారంలోకి వచ్చిన నాటి నుండి బిఆర్ఎస్ పార్టీ నాయకులను టార్గెట్ చేస్తూ తప్పుడు కేసులు పెడుతూ ఇబ్బందులకు గురి చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నికలు వస్తున్నాయంటే చాలు బిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులను విచారణ పేరుతో డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారు. అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఇచ్చింది ప్రజలకు ఏదో మంచి చేస్తారనే తప్ప ప్రతిపక్ష నాయకులను ఇబ్బందులకు గురి చేయటం కోసం కాదని ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ నాయకులు గుర్తు తెచ్చుకోవాలని అన్నారు. అధికారం ప్రజలకు మంచి చేయాలి తప్ప ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేసే ప్రతిపక్ష నాయకులపై తప్పుడు కేసులు పెట్టడం కాదని అన్నారు. ఆరు గ్యారెంటీలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటామని వారు అన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ నాయకులు పాలనపై దృష్టి సారించి ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అధికార ప్రతినిధి టి రాము, యువజన విభాగం అధ్యక్షులు సయ్యద్ అజ్ఞు, ఉపసర్పంచ్ తాటి పాపారావు, ఎస్సీ సెల్ నాయకులు నిట్ట రాములు, ఎస్టీ సెల్ నాయకులు లక్ష్మీనారాయణ, పార్టీ ముఖ్య నాయకులు జాడి ప్రభాకర్, పి.సుధాకర్ తాటి కృష్ణ, కుంజ సుధాకర్, మల్లయ్య, గంగాధరి ప్రమోద్, సతీష్, కిరణ్, ప్రశాంత్, రవి, తదితరులు పాల్గొన్నారు.
