Subscribe Us

SB LATEST:

31, జనవరి 2026, శనివారం

రామాలయంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు.....భక్తులకు అన్నప్రసాద పంపిణీ

నాగర్ కర్నూల్, జనవరి 31, ఎస్ బి న్యూస్):
నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని రామ్‌నగర్ కాలనీలో ఉన్న శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయంలో మాఘ పౌర్ణమిని పురస్కరించుకొని ఆదివారం ఉదయం 10:30 గంటలకు సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించనున్నట్లు రామాలయ ప్రధాన అర్చకులు కందాడై వరదరాజన్ అయ్యంగార్ తెలిపారు.
ఈ వ్రతాలలో పాల్గొనే భక్తులందరి పేర్లతో పాటు గోత్రనామాలతో సంకల్పం చెప్పి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. అనంతరం తీర్థ ప్రసాదాల పంపిణీ చేస్తామని ఆయన తెలిపారు.
అలాగే రామాలయ అన్నప్రసాద కమిటీ ఆధ్వర్యంలో వ్రతాలలో పాల్గొన్న భక్తులందరికీ మధ్యాహ్నం అన్నప్రసాదం పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రాంత భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపాకటాక్షాలకు పాత్రులు కావాలని ఆయన కోరారు.