దుమ్ముగూడెం మండలంలోని రామారావుపేట గ్రామం, ఒడ్డు గుంపు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు లయన్స్ క్లబ్ – డాక్టర్స్ ఫ్యామిలీ సభ్యులు అండగా నిలిచారు.
పాఠశాలలో విద్యార్థుల సౌకర్యార్థం రూ.24,000 విలువైన బల్లలను (డెస్క్‌లు) సోమవారం వితరణ చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు లయన్స్ క్లబ్ తమ వంతు సహకారం అందించింది.
ఈ బల్లల ఏర్పాటు వల్ల విద్యార్థులు నేలపై కూర్చోవాల్సిన అవసరం లేకుండా, సౌకర్యవంతంగా తరగతి గదిలో కూర్చొని పాఠాలు వినే అవకాశం కలిగింది. దీంతో చదువు పట్ల ఆసక్తి మరింత పెరుగుతుందని ఉపాధ్యాయులు తెలిపారు.
మారుమూల గ్రామాల్లోని పాఠశాలలను గుర్తించి, పిల్లల విద్యకు తోడ్పడుతున్న లయన్స్ క్లబ్ సభ్యులను గ్రామస్తులు, ఉపాధ్యాయులు అభినందించారు. ఈ సందర్భంగా క్లబ్ ప్రతినిధులు మాట్లాడుతూ, విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించడం ద్వారా వారి భవిష్యత్‌కు బలమైన పునాది వేయవచ్చని, రాబోయే రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ డాక్టర్స్ ఫ్యామిలీ సభ్యులు
కమలా రాజశేఖర్, వనజ మోహనరావు, భారతి నారాయణ్ రావు, పవన్, సిద్ధారెడ్డి, నరసింహ చారి,
0 కామెంట్‌లు