యాదవ యువత అన్ని రంగాల్లో రాణించాలి : అశ్వాపురం ఇంచార్జ్ ఎంపీడీఓ ముత్యాల రావు

యాదవ యువత అన్ని రంగాల్లో రాణించాలి : అశ్వాపురం ఇంచార్జ్ ఎండీఓ ముత్యాల రావు
అశ్వాపురం మండలం మల్లెలమడుగు రైతు వేదిక ప్రాంగణంలో ఆదివారం మల్లెలమడుగు, మొండికుంట, రామచంద్రపురం గ్రామాల యాదవ యువత ఆధ్వర్యంలో రూపొందించిన క్యాలెండర్‌ను ఘనంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అశ్వాపురం ఇంచార్జ్ ఎండీఓ ముత్యాల రావు మాట్లాడుతూ, సామాజికంగా చైతన్యవంతులైన యాదవ యువత అన్ని రంగాల్లో విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
క్యాలెండర్ ఎంతో అందంగా, సమగ్ర వివరాలతో రూపొందించారని ప్రశంసించారు. యాదవ యువత ఐక్యతతో ముందుకు సాగితే సమాజాభివృద్ధి వేగవంతమవుతుందన్నారు.
విశిష్ట అతిథులుగా హాజరైన సారపాక సీనియర్ ఉపాధ్యాయులు మల్లెల సత్యనారాయణ, కమలాపురం ప్రధానోపాధ్యాయులు బొల్లం ఐలయ్య, భద్రాచలం రిటైర్డ్ ఏటిడబ్ల్యూఓ తుప్పతూరి వీరసోములు, సర్గం బాలనర్సయ్య, తూము పెద్ద రాఘవులు మాట్లాడుతూ—యాదవ సమాజం అభివృద్ధి చెందాలంటే ప్రధానంగా విద్యపై దృష్టి పెట్టాలని, ఆర్థిక వనరులను సమీకరించుకుంటూ అన్ని రంగాల్లో ముందుకు సాగాలని సూచించారు.
సభకు అధ్యక్షత వహించిన జర్నలిస్ట్ వెలమ రాజేందర్ మాట్లాడుతూ, యాదవ సమాజం అభివృద్ధి చెందాలంటే ప్రతి యాదవుడు ఒకరికొకరు సహకరించుకోవాలని, ఇప్పటికే అభివృద్ధి చెందిన వారు వెనుకబడిన వారికి చేయూతనందించాలని పిలుపునిచ్చారు. క్యాలెండర్ ఆవిష్కరణను కేంద్రంగా చేసుకుని యాదవ యువత అభివృద్ధి కార్యక్రమాల కోసం ఒక స్పష్టమైన ప్రణాళిక రూపొందించనున్నట్లు వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో దేవరపు శ్రీనివాస్, తూము చిన్న వీర రాఘవులు, కోడి పెద్ద వెంకన్న, బద్ది సందీప్, వేల్పుల నారాయణ, పసుల వినయ్, చిట్యాల సత్యం, బద్ది సాయిలు, బాతుక ఐలయ్య, తూము వెంకన్న, దారపు శ్రీనివాస్, మంగి విజయ్ తదితర యాదవులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు