నాగర్ కర్నూల్, జనవరి 22,(ఎస్ బి న్యూస్): నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట పట్టణంలోని కొత్త బస్టాండ్ ప్రాంతంలో ప్రజలు, వాహనాల రవాణా సౌకర్యార్తం నూతనంగా ఏర్పాటు చేస్తున్న అండర్‌గ్రౌండ్ డ్రైనేజ్ బ్రిడ్జి పనులను ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ స్థానిక నాయకులతో కలిసి గురువారం పరిశీలించారు.
ఈ సందర్భంగా పనుల పురోగతిని తెలుసుకున్న ఎమ్మెల్యే, ప్రజలకు ఇబ్బందులు లేకుండా నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేయాలని సంబంధిత కాంట్రాక్టర్లకు సూచించారు. నాణ్యతకు ప్రాధాన్యం ఇవ్వాలని, పనుల్లో ఎలాంటి నిర్లక్ష్యం వహించరాదని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, పార్టీ కార్యకర్తలు, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.
