Subscribe Us

SB LATEST:

22, జనవరి 2026, గురువారం

విధి నిర్వహణలో మృతి చెందిన ఫారెస్ట్ వాచర్ కుటుంబానికి రూ.10 లక్షల ఎక్స్గ్రేషియా

నాగర్ కర్నూల్, జనవరి 22(ఎస్ బి న్యూస్): నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజక వర్గ పరిధి లోని 
అమ్రాబాద్ మండలం మాచారం గ్రామానికి చెందిన దాసరి శ్రీనివాసులు అటవీ వాచర్‌గా విధులు నిర్వహిస్తూ అకస్మికంగా గుండెపోటుతో బుధ వారం రోజు మృతి చెందారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ మృతుడి కుటుంబాన్ని పరామర్శించారు.
ఈ సందర్భంగా అటవీ అధికారులతో మాట్లాడి, మృతుడి కుటుంబానికి ప్రభుత్వం తరఫున రూ.10 లక్షల ఎక్స్గ్రేషియా మంజూరు చేయించారు. అనంతరం రూ.10 లక్షల రూపాయల చెక్కును కుటుంబ సభ్యులకు అందజేశారు.
విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన ఉద్యోగి కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా సహాయ సహకారాలు అందజేస్తుందని బాధిత కుటుంబానికి ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. భవిష్యత్తులో కూడా ఆ కుటుంబానికి అండగా ఉంటామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో అటవీ శాఖ జిల్లా అధికారి రేవంత్ చంద్ర, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అటవీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.