Subscribe Us

SB LATEST:

22, జనవరి 2026, గురువారం

గుండాల మండలం తురుబాక గ్రామంలో కుట్టు మిషన్ల పంపిణీ – బయోచార్ అవగాహన సదస్సు

గుండాల మండలం జనవరి 21 (స్వాతంత్ర్య భారత్) ప్రతినిధి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం ముత్తాపురం పంచాయతీ పరిధిలోని తురుబాక గ్రామంలో గ్రామ స్వరాజ్య సంస్థ (GRASS) ఆధ్వర్యంలో మహిళా సాధికారత లక్ష్యంగా కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. అర్హులైన మహిళలకు కుట్టు మిషన్లు అందజేశారు.

ఈ సందర్భంగా పత్తి పంట అవశేషాలతో బయోచార్ తయారీ, వినియోగంపై రైతులు, మహిళా రైతులకు అవగాహన కల్పించారు. బయోచార్ వాడకంతో నేల సారవంతం పెరిగి పంట దిగుబడులు మెరుగవుతాయని, రసాయన ఎరువుల ఖర్చు తగ్గుతుందని తెలిపారు.

ప్రాజెక్ట్ డైరెక్టర్ దీకొండ దుష్యంత్ కుమార్ మాట్లాడుతూ మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించడం, రైతుల ఆదాయం పెంపు సంస్థ లక్ష్యమని అన్నారు. ఉపసర్పంచ్ తాటి రమేష్, ఆదివాసీ సంక్షేమ పరిషత్ మండల అధ్యక్షులు పూనెం రమణ బాబు పాల్గొని కార్యక్రమాన్ని అభినందించారు. గ్రామ రైతులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.ఫీల్డ్ కోఆర్డినేటర్లు పెండకట్ల హరికృష్ణ, గంగాధరి హరీష్, అలాగే ఆఫీస్ ఇన్‌చార్జ్ రెగళ్ల రవి కుమార్, పర్షిక సమ్మక్క ముఖ్య పాత్ర పోషించారు. గ్రామ స్వరాజ్య సంస్థ భవిష్యత్తులో కూడా మహిళా సాధికారత, రైతు సంక్షేమానికి సంబంధించి ఇలాంటి కార్యక్రమాలను కొనసాగిస్తుందని నిర్వాహకులు తెలిపారు.