Subscribe Us

SB LATEST:

2, జనవరి 2026, శుక్రవారం

మద్దిమడుగులో ఎయిర్టెల్ సిగ్నల్ పనులు వేగవంతం చేయాలని ఆదేశాలు

మద్దిమడుగులో ఎయిర్టెల్ సిగ్నల్ పనులు వేగవంతం చేయాలని ఆదేశాలు
నాగర్ కర్నూల్, జనవరి 02,(ఎస్ బి న్యూస్): నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజక వర్గం లోని పదర మండలం మద్దిమడుగు గ్రామంలోని శ్రీ పబ్బతి ఆంజనేయ స్వామి ఆలయ ఆవరణలో ఏర్పాటు చేయనున్న ఎయిర్టెల్ సిగ్నల్ సైట్‌ను శుక్ర వారం రోజు సంబంధిత అధికారులు సందర్శించి పరిశీలించారు. ఆలయ ఆవరణలోని ఎయిర్టెల్ సిగ్నల్ సైట్ ప్రాంతాన్ని పరిశీలించిన అనంతరం, సిగ్నల్ ఏర్పాటుకు సంబంధించిన పనులను వేగవంతం చేయాలని ఎయిర్టెల్ అధికారులకు సూచించారు.
ప్రస్తుతం చేపడుతున్న సిగ్నల్ పనులను రాబోయే 15 నుంచి 20 రోజులలోపు పూర్తిచేసి ప్రారంభోత్సవం (ఓపెనింగ్) చేయాలని ఎయిర్టెల్ సిగ్నల్ అధికారులను ఆదేశించారు. ఈ సిగ్నల్ ఏర్పాటు ద్వారా మద్దిమడుగు గ్రామ ప్రజలకు మెరుగైన నెట్‌వర్క్ సౌకర్యం అందుబాటులోకి రానుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో మద్దిమడుగు ఆలయ కమిటీ చైర్మన్ దేశవత్ రాములు నాయక్, ఎస్ డి ఈ దేశావత్ చందు , అలాగే ఆలయ కమిటీ డైరెక్టర్లు వెంకటేశ్వర్ల రెడ్డి, నాగిరెడ్డి, సుబ్బదాస్, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.