నాగర్‌కర్నూల్, జనవరి 01, ఎస్ బి న్యూస్):
భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) నాయకుడు గువ్వల బాలరాజు తన నోరును,మాటలపై అదుపు పెట్టు కోవాలని పార్టీ నాయకులు హెచ్చరించారు. కేటీఆర్ పై ఇష్టం వచ్చినట్లుగా వ్యాఖ్యలు చేస్తే గ్రామాల్లో తిరగనివ్వబోమని వారు స్పష్టం చేశారు.
నాగర్‌కర్నూల్‌లో ఇటీవల నిర్వహించిన సర్పంచుల సన్మాన కార్యక్రమాన్ని చూసి గువ్వల బాలరాజు అసహనానికిలోనవుతున్నారని బీఆర్ఎస్ నేతలు విమర్శించారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించేందుకు తన ప్రాణాలను ఫణంగా పెట్టిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను, అలాగే తెలంగాణ భవిష్యత్ ముఖ్యమంత్రి గా ప్రజలు భావిస్తున్న కేటీఆర్ ను అవమానకరంగా మాట్లాడటం తగదని పేర్కొన్నారు.
కేసీఆర్ లేకపోతే గువ్వల బాలరాజు రాజకీయంగా ఎక్కడ ఉండేవారో గుర్తు చేసు కోవాలని వారు హితవు పలికారు. భారతీయ జనతా పార్టీలో చేరిన తర్వాత జరిగిన స్థానిక సర్పంచ్ ఎన్నికల్లో రెండు స్థానాలు మాత్రమే గెలిచినప్పటికీ, ఆయనే స్వయంగా ప్రచారానికి వెళ్లలేదని తెలిపారు. ప్రజలు తిరస్కరిస్తారనే భయంతోనే ప్రచారానికి దూరంగా ఉన్నారని వారు విమర్శించారు.
అలాగే, భారతీయ జనతా పార్టీలో కూడా గువ్వల బాలరాజు కు సరైన గుర్తింపు లేదని, అయినప్పటికీ కేసీఆర్ బీఆర్ఎస్ నాయకులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ పత్రికా సమావేశాలు నిర్వహించడం సరికాదని పేర్కొన్నారు. ఈ విధమైన వ్యాఖ్యలు కొనసాగితే ఆయనపై పార్టీ అధిష్టానం కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉందని హెచ్చరించారు. మాజీ ఎమ్మెల్యే
గువ్వల బాలరాజు మాటలపై నియంత్రణ పాటిస్తేనే మంచిదని బీఆర్ఎస్ నేతలు సూచించారు.
ఈ సమావేశంలో
ఎనుపోతుల గణేష్ యువ,
బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఏకుల ధర్మయ్య, అనంతరాములు, ఉడతల శ్రీను, మున్నా పాల్గొన్నారు.
