పినపాక
నూతన సంవత్సరం సందర్భంగా పినపాక మండలం సిపిఎం పార్టీ బలపరిచి విజయం సాధించిన బోటుగూడెం సర్పంచ్ నూప బాపనమ్మ అధికారులను మర్యాదపూర్వకంగా కలిశారు. అధికారులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు
ముందుగా పినపాక తాసిల్దార్ గోపాలకృష్ణని కలిసి శాలువాతో సన్మానించి, పూల మొక్కను అందజేశారు. అనంతరం పినపాక ఎంపీఓ వెంకటేశ్వరరావును కలిసి గ్రామపంచాయతీలో దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలను వివరించారు. అనంతరం ఎంపీఓను సన్మానించి , పూల మొక్కను అందజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు నిమ్మల వెంకన్న, బోటి గూడెం వార్డు మెంబర్లు, తదితరులు పాల్గొన్నారు.
