పినపాక
యువత క్రీడల్లో రాణించి చెడు వ్యసనాలకు దూరంగా ఉండి సమాజానికి గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని చెగర్శల సర్పంచ్ లక్కి భాగ్యలక్ష్మీ సూచించారు. గురువారం నూతన సంవత్సర సందర్భంగా స్థానిక యువతకు వాలీబాల్, దానితోపాటు వాలీబాల్ కిట్ అందజేశారు. క్రీడా మైదానంలో ప్రతిరోజు ఉదయం సాయంత్రం యువత క్రీడలు ఆడుకోవాలని సూచించారు. అనంతరం సర్పంచ్ మాట్లాడుతూ గ్రామంలో సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి తన వంతు పరిష్కార దిశగా కృషి చేస్తారని తెలిపారు. ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ముందుగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక యువత పాల్గొన్నారు.
