మణుగూరు, జనవరి 2: సింగరేణి కాంటాక్ట్ కార్మికులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ప్రకటించాలని సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు సత్రపల్లి సాంబశివరావు డిమాండ్ చేశారు. సింగరేణి కాంటాక్ట్ కార్మికుల సదస్సులో ఆయన మాట్లాడుతూ, ఏండ్ల తరబడి సంస్థ అభివృద్ధికి శ్రమిస్తున్న కార్మికులకు సమాన పనికి సమాన వేతనం, లాభాల్లో వాటా, కనీస వేతన చట్టం అమలు కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పీఎఫ్ తప్ప ఇతర భద్రత లేకుండా కార్మికులు జీవనం కొనసాగిస్తున్నారని, యాజమాన్యం జోక్యం చేసుకొని రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని కోరారు. ఈ సందర్భంగా తోటి కార్మికుడు దేవుళ్ల భద్రయ్య రిటైర్మెంట్ సందర్భంగా సన్మానించారు. కార్యక్రమంలో వేకాస జిల్లా ఉపాధ్యక్షులు బత్తుల వెంకటేశ్వర్లు, కార్మిక సంఘ నాయకులు హిమంబి ఆదిలక్ష్మి, శ్రీవాణి, నరసింహారావు, బుక్కొండ సమ్మన్న, బుక్య రాందాస్, సింగరేణి మాజీ నాయకులు, సీపీఐ(ఎం) పార్టీ ఆఫీస్ కార్యదర్శి నరసయ్య తదితరులు పాల్గొన్నారు.
సింగరేణి కాంటాక్ట్ కార్మికులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ప్రకటించాలి
