అచ్చంపేట, జనవరి 30 (ఎస్ బి న్యూస్):నాగర్‌కర్నూల్ మున్సిపాలిటీ నామినేషన్ కేంద్రం వద్ద శుక్రవారం ఉద్రిక్త తపరిస్థితి నెలకొంది. నామినేషన్ ప్రక్రియ కొనసాగుతున్న సమయంలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వల్లపురెడ్డిపై శరత్ చేయి చేసుకున్న ఘటన చోటుచేసుకుంది.
ఈ సంఘటనతో అక్కడ ఒక్కసారిగా ఘర్షణ వాతావరణం ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. దాడికి పాల్పడ్డ శరత్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ నిమిత్తం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ
ఘటన నేపథ్యంలో నామినేషన్ కేంద్రం వద్ద భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. అధికారుల అప్రమత్తతతో పరిస్థితి ప్రస్తుతం నియంత్రణలోకి వచ్చింది. ఎన్నికల్లో ఏ లాంటి ఘర్షణలు లేకుండా చోటు చేసుకోకుండా పోలీసు అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు ఓటరు దేవుళ్ళు కోరుతున్నారు.
