Subscribe Us

SB LATEST:

30, జనవరి 2026, శుక్రవారం

తాగునీటి సమస్యను తీర్చిన పొట్లపల్లి సర్పంచ్ సమ్మయ్య

పినపాక మండలం పొట్లపల్లి గ్రామపంచాయతీలో తాగునీటి సమస్యకు పరిష్కారంగా సర్పంచ్ మద్దెల సమ్మయ్య చర్యలు చేపట్టారు. గ్రామంలో పనిచేయని తాగునీటి బోర్లను గుర్తించి రిపేర్ పనులు పూర్తి చేయించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ, గ్రామ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిరంతరం తాగునీరు అందేలా అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. భవిష్యత్తులో కూడా మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తామని ఆయన అన్నారు.