Subscribe Us

SB LATEST:

30, జనవరి 2026, శుక్రవారం

చరిత్రను విచారణలతో కాదు, ప్రజల తీర్పుతోనే రాస్తారు- బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సతీష్ రెడ్డి

పినపాక :కేసీఆర్, కేటీఆర్ తో పాటు ఇతర బీఆర్ఎస్ నాయకులకు కు సిట్ నోటీసులు ఇవ్వటాన్ని బీఆర్ఎస్ నాయకులు ఖండించారు. శుక్రవారం పినపాక మండలం ఈ బయ్యారం క్రాస్ రోడ్ లో పార్టీ మండల అధ్యక్షులు సతీష్ రెడ్డి ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు సతీష్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిపక్ష నాయకులను చేసేది విచారణ కాదన ఇది ప్రతీకారమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కక్షసాధింపు రాజకీయాలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.ప్రభుత్వ వైఫల్యాలను దాచిపెట్టేందుకు, పాలనా లోపాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఈ తరహా విచారణలు చేపడుతున్నారని తీవ్రస్థాయిలో విమర్శించారు.
విచారణల పేరుతో మాజీ ముఖ్యమంత్రి, నాయకులకు నోటీసులు ఇవ్వడం కక్షసాధింపు రాజకీయాలకు నిదర్శనమని అన్నారు. ఇది న్యాయ ప్రక్రియ కాదని, ప్రతీకార చర్యలేనని వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రజల గుండెల్లో కేసీఆర్ స్థానం పదిలమని, నోటీసులు, బెదిరింపులతో తెలంగాణ చరిత్రను చెరిపివేయలేరని స్పష్టం చేశారు.
తెలంగాణ ఉద్యమాన్ని, రాష్ట్ర ఆత్మగౌరవాన్ని అవమానించే ప్రయత్నాలు చేస్తే ప్రజలే తగిన సమాధానం ఇస్తారని హెచ్చరించారు. ఈ రాజకీయ దురుద్దేశపూరిత చర్యలను భారత రాష్ట్ర సమితి తీవ్రంగా ఖండిస్తోందని తెలిపారు.
ప్రజల పక్షాన నిలబడి, ప్రజల గొంతుకగా అన్యాయ పాలనకు వ్యతిరేకంగా పోరాటం కొనసాగిస్తామని వెల్లడించారు. తెలంగాణ చరిత్రను విచారణలతో కాదు, ప్రజల తీర్పుతోనే ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు సత్తిబాబు, సీనియర్ నాయకులు భవాని శంకర్, దాట్ల వాసు బాబు, గుమ్మడి గాంధీ, రవి శేఖర్ వర్మ, చింతపండు సత్యం, చెన్నకేశవులు, జహంగీర్, తదితర నాయకులు పాల్గొన్నారు.