పినపాక: అమరారం గ్రామపంచాయతిలో నర్సరీ పనులు ప్రారంభమయ్యాయి. స్థానిక సర్పంచ్ శోభారాణి, సెక్రటరీ కాజా హుస్సేన్ ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ పరిధిలో నర్సరీని ఏర్పాటు చేసి మొక్కలను పెంచుతున్నట్లు తెలిపారు. గ్రామంలో ఇంటింటికి మొక్కలు అందించాలనే లక్ష్యంతో ఈ నర్సరీ పనులు చేపట్టామని, పర్యావరణ పరిరక్షణతో పాటు హరిత కార్యక్రమాలకు ఇది దోహదపడుతుందన్నారు. గ్రామాన్ని పచ్చదనంతో తీర్చిదిద్దేందుకు ప్రజల సహకారం అవసరమని వారు కోరారు.
0 కామెంట్‌లు